మండల కేంద్రమైన గడివేముల లోని పార్టీ కార్యాలయం వద్ద సోమవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని ఇవాళ నిర్వహించారు. జడ్పీటీసీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.