గత వైసీసీ ప్రభుత్వంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "కనీస అవగాహన లేకుండా ప్రాజెక్టులను నాశనం చేశారు. పట్టిసీమ కాదు.. ఒట్టిసీమ అన్న జగన్ రాజకీయాలకు అనర్హుడు. పట్టిసీమ లేకపోతే కృష్ణాడెల్టా పరిస్థితి ఏమిటో ఆలోచించండి. ఏటా 35 టీఎంసీలు నిల్వ చేసి రైతుల పంటలు పండిస్తాం. పోలవరం పూర్తయ్యే వరకు డెల్టాను పట్టిసీమ కాపాడుతుంది." అని మంత్రి వ్యాఖ్యానించారు.