డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రావిరాల మహేశ్ కుమార్‌ను పి. గన్నవరం MLA గిడ్డి సత్యనారాయణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఎమ్మెల్యే పూలమొక్కను అందజేసి సత్కరించారు. పి. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని ఆయన్ను కోరారు. ఈ కార్యక్రమంలో కొండుకుదురు సర్పంచ్ మేడిద దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa