బీసీ ల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ ను ఆమె పరిశీలించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ నా బిసి, నా బడుగులని ఓట్లు వేయించుకొని బిసిలను అన్ని రంగాలలో మోసం చేసిన పార్టీ జగన్ పార్టీ అని , బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అనిమంత్రి సవితమ్మ అన్నారు.