తయారీ లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని ఫ్రాంచైజీ స్టోర్లకు సూచించామని తెలిపింది. అలాగే వాటికి సంబంధించిన ప్రకటనలను ప్రచురించొద్దని మీడియా సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చినపతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.