అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. సోమవారం కురిసిన చిన్నపాటి వర్షానికి బస్టాండ్ ఇన్ సైడ్ గేట్ వర్షపు నీటితో నిండి చెరువుగా మారింది. వర్షపు నీరు సైడ్ డ్రెయిన్ లోకి వెళ్లే మార్గం లేకపోవడంతో నీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారింది. ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల దృష్టికి సమస్యను విన్నపించిన పట్టించుకున్న దాఖలు లేవు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు.