ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలోని ఎరువుల పురుగు మందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. స్టాకు సంబంధించిన అన్ని రకాల బిల్లులు రిజిస్టర్లు ఉండాలన్నారు. కొనుగోలు చేసే ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లులు అందజేయాలని అలా చేయకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్ ఛార్జ్ ఏ. డి. ఏ నీరజ, శ్రీనివాస్ నాయక్, సిబ్బంది ఉన్నారు.