చిత్తూరు నగర పరిధిలో పూనేపల్లి వద్ద నిర్మించిన టిడ్కో గృహాల లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే, మేయర్ ఎస్ అముద, కమిషనర్ డా. జె అరుణ, టిడ్కో అధికారులతో కలిసి పూనేపల్లె వద్దనున్న టిడ్కో గృహాలను సందర్శించారు. గృహ సముదాయంలో గృహాలను, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. పెండింగ్ పనులపై టిడ్కో అధికారులతో చర్చించారు.