అద్దంకి నియోజకవర్గంలో ఇసుక కొనుగోలు చేసే వారి కోసం రవాణా చార్జీలను మంగళవారం అధికారులు ఖరారు చేశారు. ట్రాక్టర్ ట్రాలీకు 5టన్నుల ఇసుకను పరిమితిగా విధించారు, అదే విధంగా ట్రాక్టర్ కి సంబంధించి రవాణా చార్జీలు 15 కిలోమీటర్లలోపు రూ. 1500, 16-30 కి. మీ రూ. 2400, 31-45 కి. మీ రూ. 3000, 46-60 కి. మీ రూ. 3500 శ్లాబుల విధానాన్ని ఖరారు చేశారు. 60 కిలోమీటర్ల పైన, 1 కి. మీ రూ. 12 వసూలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.