విజయవాడ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్లో ఇవాళ (మంగళవారం) అర్ధరాత్రి బాయిలర్ నుంచి మంటలు చెలరేగి గాయపడిన ఇద్దరు కార్మికులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్, మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. అర్ధరాత్రి సమయంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో బూడిద నిల్వ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. దీంతో మంటలు చేలరేగి ఓ ఉద్యోగి, మరో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. విషయం తెలుసుకున్న మంత్రి వాసంశెట్టి బాధితులను పరామర్శించారు.