బొబ్బిలి పట్టణంలోని ఓ కాలనీకి చెందిన యువతిని పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేసిన కేసులో నిందితునికి పదిసంవత్సరాల కఠిన కారాగారశిక్ష, 30 వేల రూపాయల జరిమానా విధిస్తూ ఉమెన్స్ కోర్టు, అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయాధికారి ఎన్.పద్మావతి మంగళవారం తీర్పును వెలువరించా రు. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2016 జూలై 7న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొబ్బిలి పట్నంలో గుడారి వీధి కి చెందిన సర్వసిద్ధి వెంకటేష్‌పై అప్పటి సీఐ వై.రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా అనుభవించిన తరువాత పెళ్లి చేసుకునేందుకు నిరాకరించినట్లు ప్రధానమైన అభియోగం. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన తరువాత న్యాయమూర్తి నిందితునికి శిక్షవి ధిస్తూ తీర్పు చెప్పా రు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రఘురామ్ వ్యవహరించారు. ఈ కేసులో సేవలందించిన హెచ్‌సీ సీహెచ్ స్వామినాయుడును సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు.