విజయనగరం జిల్లా, మక్కువలో జగనన్న కాలనీ నుంచి చెముడు గ్రామా నికి వెళ్లే ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి ఓ బైక్ అదుపు తప్పింది. దీంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. చెముడు గ్రామానికి చెందిన జి.వెంకటనాయుడు(60), ఎల్.శ్రీరామ్‌లు సమీప బంధువులు. మంగళవారం మా ర్కెట్ కోసమని బైక్‌పై వారు స్వగ్రామం నుంచి మక్కువ వచ్చారు. వారికి అవస రమైన సరుకులను కొనుగోలు చేసుకున్న తర్వాత రాత్రి తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి పయనమయ్యారు. అయితే మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి బైక్ బోల్తా పడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన వెంకటనా యుడు, శ్రీరామ్‌లను స్థానికులు మక్కువలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్క డ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని జిల్లాకేంద్రానికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ వెంకటనాయుడు మృతి చెందాడు. శ్రీరామ్‌ను కేజీ హెచ్‌కు తరలించారు. దీనిపై మక్కువ ఎస్ఐ నర్సింహమూర్తి మాట్లాడుతూ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.