పిల్లల్లో వ్యాధి నిరోధకశక్తి పెంపునకు టీకాలు ఎంతో దోహదపడుతాయని కోసువారిపల్లి పీహెచ్సీ వైద్యురాలు ఆశాలత అన్నారు. ప్రతి బుధవారం, శనివారం అన్ని ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఇమ్యూనైజేషన్ టీకాలను పంపిణీ చేస్తామన్నారు. తంబళ్లపల్లెకు సమీపంలోని బూదలవారిపల్లి ఆరోగ్య ఉపకేంద్రంలో 10 మంది చంటి పిల్లలు, నలుగురు గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేశారు. మిషన్ ఇంద్ర ధనుష్లో భాగంగా పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.