వైసీపీ అధిష్టానంపై కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మండిపడ్డారు. ప్రాణాలు తెగించి పార్టీ కోసం పని చేస్తే సస్పెండ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ మోసం చేసిందంటూ సిద్ధారెడ్డి కంటతడి పెట్టారు. వైసీపీని మోసం చేయలేదని.. ఎలాంటి నోటీస్.. వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చాంద్ బాషా పార్టీ ఫిరాయించినా పది సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేశానన్నారు.