రాజుపాలెం మండలంలోని రాజుపాలెం, ఏరువపాలెం గ్రామాల్లోని పొలాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఆధ్వర్యంలో సహజవాయువు నిక్షేపాల కోసం శుక్రవారం సర్వే నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పరికరాల సహాయంతో బోర్లు వేస్తూ ప్రత్యేక సెన్సార్ల ద్వారా సర్వేని నిర్వహిస్తున్నారు.