ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. మురుగు కాలువలో గురువారం ఓ శిశువు మృతదేహం లభ్యం అయ్యింది. అప్పుడే పుట్టిన పసికందును రెండు,మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కాలువలో విసిరేసి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పురపాలిక సిబ్బంది కాలువలో మృతదేహాన్ని వెలికితీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa