ఆదోని ఆర్టీసీ డిపోలో ఆదోని-బెంగళూరు నూతన బస్సును ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి డిపో మేనేజర్ ఎం. డి రఫీక్‌తో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆర్టీసీ ఉద్యోగస్థులను నిందించడం సరికాదన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి డ్రైవర్లు దూర ప్రాంతాల నుంచి డ్రైవింగ్ చేస్తూ కొంత అసహనానికి గురైనప్పుడు ప్రజలు, ప్రయాణికులు కొంత సంయమనం పాటించాలన్నారు.