నంద్యాల జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజకుమారిని శుక్రవారం శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శ్రీశైల దేవస్థానం తరఫున శాలువాతో పాటు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైల దేవస్థానం నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.