వజ్రకరూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఓ మైనర్ బాలికను నమ్మించి మోసం చేశాడు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించి బాలికతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం భాస్కర్ పై పోక్సో కింద కేసు నమోదు చేశారు.