నల్లచెరువు మండల కేంద్రం స్థానిక బస్టాండ్ కూడలిలో ప్రమాదం పొంచి ఉంది. స్థానిక బస్టాండ్ కూడలిలో నడిరోడ్డు లో మురికి నీటి కాలువపై వేసిన కల్వర్టు పాడైపోవడంతో పెద్ద గుంత ఏర్పడింది. గత రెండు రోజుల క్రితం ప్రయాణికులను ఎక్కించుకొని వెళుతుండగా ప్రమాదవశాత్తు ఆ గుంతలో ఆటో ఇరుక్కుపోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దానిని బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనిగ్రామ ప్రజలు కోరుతున్నారు.