కందుకూరు పట్టణంలో అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ట్రాఫిక్ సమస్య అని చెప్పవచ్చు. పోలీసు అధికారులు మాత్రం అడుగుపెట్టి బాధ్యతలు తీసుకున్న వెంటనే ట్రాఫిక్ ను నిర్మూలిస్తామని తెలుపుతారు. తరువాత అది మాటలకే పరిమితమై ఉండేది. అయితే అదే కోవలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు చేరుతున్నాడా లేక ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కరించేందుకు ఆయన వేసిన అడుగులు ముందుకు సాగుతున్నాయా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.