ఓబులవారిపల్లె మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ నిధులు గోల్ మాల్ చేశారనే అభియోగంపై సస్పెండ్ అయ్యారు. కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున ప్రతిరోజు రాజంపేట న్యాయస్థానానికి వెళ్లి వచ్చేవారు. న్యాయస్థానానికి సంబంధించిన దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు గోల్ మాల్ చేశారనే అభియోగంపై శనివారం జిల్లా ఎస్పీ కృష్ణారావు సస్పెండ్ చేశారు.