యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది.. 46 ఏళ్ల తర్వాత ఒడిశా లోని పూరీ జగన్నాథుడి భాండాగారం తెరుచుకుంది.. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ సూచనలతో అధికారులు భాండాగారం ఓపెన్ చేశారు. రహస్య గది లోని నిధిని లెక్కించేందుకు వేరే ప్రాంతానికి తరలించ నున్నారు. ఇందుకోసం కొత్త చెక్క పెట్టెలు కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ భాండాగారంలో ఎంత సంపద ఉందనేది దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది.