ధర్మవరం నుంచి చెన్నై వయా కదిరి, మదనపల్లి, తిరుపతి మీదుగా చెన్నై సూపర్ లగ్జరీ బస్సును నడుపనున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నైకు రూ. 775, పిల్లలకు రూ. 400, అదేవిధంగా తిరుపతికి రూ. 500 ఛార్జీ ఉంటుందని తెలిపారు. చెన్నైకు వెళ్లే ప్రయాణికులకు తిరుమల దర్శనం టికెట్లు కూడా లభిస్తుందన్నారు.