సీపీఎస్ ఉద్యోగులను జీపీఎస్ లోకి తీసుకొస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ధర్మవరంలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.