ధర్మవరం మున్సిపాలిటీలోని 18వ వార్డులో ఆదివారం వార్డు వాచ్ కార్యక్రమం నిర్వహించినట్లు వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కత్తుల బాజ్జి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. మంత్రి సత్య కుమార్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 187వ పోలింగ్ బూత్ వద్ద గుర్తించిన పైప్ లైన్ సమస్యను మున్సిపల్ కార్మికులతో మరమ్మతు చేయిస్తామని తెలిపారు.