అనంతపురంలో 1200 ఎకరాల భూమి చూపిస్తే ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అధ్యయనం చేస్తామని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో అమరావతిలో వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రామ్మోహన్ నాయుడును కోరారు. స్పందించిన ఆయన భూమి కేటాయిస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.