ప్రస్తుత సమాజంలో మహిళలు బయట తిరగాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడ ఎలాంటి ఆపద పొంచి ఉంటుందోనని అనుక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బయటికి వెళ్తే పరిస్థితి ఇలా ఉందని ఇంట్లో ఉంటే.. అక్కడ కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు కూడా వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు మనం నిత్యం ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ సంఘటన వింటే సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. మృగాళ్ల నుంచి కాపాడాల్సిన తండ్రే ఆ యువతి పాలిట యముడిలా మారాడు. కన్న కూతురు నగ్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం పెను సంచలనంగా మారింది.
ఉడిపి జిల్లాలోని పడుబిద్రికి చెందిన ఆసిఫ్ అనే వ్యక్తిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి కుమార్తెకు సంబంధించిన నగ్న చిత్రాలు, వీడియోలను.. ఆసిఫ్ వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో షేర్ చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పడుబిద్రి పోలీసులు.. విచారణ చేపట్టి ఆసిఫ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక తన తండ్రే తన ప్రైవేటు ఫోటోలు, వీడియోలు వైరల్ చేసినట్లు తెలుసుకున్న 19 ఏళ్ల కుమార్తె.. ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమెను హుటాహుటిన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆ యువతికి చికిత్స అందించగా.. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు డాక్టర్లు తెలిపారు.
అయితే ఆ యువతి ఫోటోలు, వీడియోలు.. తండ్రి వైరల్ చేయడానికి గల కారణాన్ని పోలీసులు గుర్తించారు. ఆ యువతి.. వారి బంధువులకు చెందిన తీర్థహళ్లి ప్రాంతంలో ఉండే తౌసిఫ్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. వారి మధ్య గత కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగుతుండగా.. వారు ఒకరికొకరు ఫోటోలు, వీడియోలు పంపించుకున్నారు. అయితే ఇటీవలె తౌసిఫ్‌ను తన ఇంటికి పిలిపించిన ఆసిఫ్.. అతడికి వార్నింగ్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా తౌసిఫ్‌పై ఆసిఫ్ దాడి కూడా చేశాడు. అనంతరం తౌసిఫ్‌తోపాటు తన కుమార్తె ఫోన్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలను కూడా తన ఫోన్‌లోకి ఆసిఫ్ పంపించుకున్నాడు.
ఆ తర్వాత వాటిని తన వాట్సాప్‌లో ఉన్న గ్రూపులన్నింటితోపాటు మిగిలిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ షేర్ చేశాడు. ఈ విషయం ఆసిఫ్ భార్యకు తెలియడంతో ఆమె భర్తను నిలదీసింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ఆసిఫ్.. తన భార్య, కుమార్తెపై దాడి చేశాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. ఫినాయిల్ తాగి చనిపోయేందుకు ప్రయత్నించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa