మార్టూరులో బాలుడు కిడ్నాప్ కి యత్నం అంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆదివారం సీ. ఐ రాజశేఖరరెడ్డి ఖండించారు. అసలు అలాంటి సంఘటనే జరగలేదన్నారు. ఆ బాలుడు బయటకు వెళ్ళి కొద్ది సేపు ఇంటికి తిరిగి రాలేదని తెలిపారు. అతడు ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించడంతో వారు మందలిస్తారనే భయంతో ఆ బాలుడు కిడ్నాప్ కథ చెప్పాడన్నారు. అయితే కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలు ప్రచురించాయని సీఐ తెలిపారు.