ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి దోచుకెళ్లిన సంఘటన ఒంగోలలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు ఒంగోలు సమతా నగర్ కు చెందిన బాలకృష్ణ శనివారం ఫంక్షన్ కు వెళ్లాడు. గమనించిన దొంగలు ఇంటి ప్రధాన ద్వారం పగలగొట్టి బీరువా లాకర్ లోని 7 సవర్ల బంగారం రూ. 1. 5 లక్షలు నగదును ఎత్తుకెళ్లారు. ఘటనపై తాలూకా పోలీసులకు బాలకృష్ణ ఫిర్యాదు చేశారు. ఒంగోలు సిఐ ఖాజావలి ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.