వెలిగండ్లలోని చౌడేశ్వరి తల్లి దేవాలయ ప్రాంగణంలో ఉన్న 150 సంవత్సరాల నాటి వేపచెట్టు కొమ్మ శనివారం విరిగి పడింది. కొమ్మ ఓ గృహంపై అలాగే రహదారిపై పడటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎస్సై శివ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని రాకపోకలకు అంతరాయం రాకుండాచెట్ల కొమ్మను తొలగించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో వర్షం పడటంతో జనసంచారం లేకపోవటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.