సంతనూతలపాడు మండలంలో కౌలు రైతులను గుర్తించి, గుర్తింపు కార్డులు అందజేయాలని తహసీల్దార్ ఎస్కే మీరావలి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక వ్యవసాయశాఖ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సంతనూతలపాడు మండలంలోని కౌలుదారులకు పంటపై మాత్రమే అధికారం ఉంటుందన్న విషయమై యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. ఏవో పి. పావని, వ్యవ సాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa