ఆంధ్రప్రదేశ్లో ఎక్కడకి వెళ్లినా ఏ ప్రాజెక్టు చూసినా వైసీపీ పాలనలో జగన్ మోహన్ రెడ్డి చేసిన విధ్యంసమే కనపడుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా.. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువగా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సోమశిల ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిల ప్రాజెక్టుకు ఆప్రాన్ రిపేర్లు కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించారని, కనీసం ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా పెట్టలేకపోయారని మండిపడ్డారు. అలాంటి వారు పోలవరం డ్యామ్ ఎలా కట్టగలరని మంత్రి ప్రశ్నించారు.