రామభద్రపురం మండలం కొండకెంగువ పంచాయితీలో ఆరు నెలల పసికంద పై నీచాతి నీచంగా 40 ఏళ్ల ఎరకన్న దొర అనే మానవ మృగం చేసిన అత్యాచారం ఘటన అమానుషం అని. తనను తీవ్రంగా కలిచి వేసిందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి మానవ మృగాడిని నడిరోడ్డుపై ఉరికంబం ఎక్కించినా తప్పులేదని మండిపడుతూ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.