గుండెపోటుతో యువకుడు మృతిచెందాడు.తాళ్ళపూడి మండల ఫొటోగ్రాఫర్స్ అసో సియేషన్ అధ్యక్షులు పలస పూడి ఆశీర్వాదం కుమారుడు సంజీవ్‌కుమార్ (29)కి నా లుగు రోజుల కిందట బిడ్డ పుట్టాడు.ఈ మేరకు ఆదివా రం మొక్కుతీర్చుకునేందుకు కుటుంబీకులతో గౌరీపట్నం మేరీమాత ఆలయానికి వెళ్లాడు. ఆలయం వద్ద గుండెల్లో తేడాగా ఉందని చెప్పాడు. గ్యాస్ ట్రబుల్ అయి ఉంటుం దని పట్టించుకోలేదు. మొక్కు తీర్చుకుని ఆసుపత్రికి వెళదామని అనుకున్నారు. అంత కంతకూ గుండె వద్ద నొప్పి పెరుగుతూనే ఉంది. కాసేపటికి తట్టుకోలేకపో వడంతో ఆసుపత్రికి తరలి స్తుండగానే మృతిచెందాడు. తల్లి దండ్రులు కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని లేరా నాన్నా అంటూ బోరున కన్నీటి పర్యంతమవడం చూపరులను కలచివేసింది.