అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ముగ్గురు విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. వి పంపిణీ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వెంకట రామయ్య, ఓబులమ్మ, భాగ్యమ్మ అనే ముగ్గురు విభిన్న ప్రతిభావంతులకు ఒక్కొక్కటి 3 వేల రూపాయలు విలువ చేసే కృత్రిమ కాళ్లను కలెక్టర్ స్వయంగా వెళ్లి అందజేశారు.