సీఎం చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కైకలూరులో టీడీపీ నాయకులు నిర్వహించిన అభినందన సభకు రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర కొలుసు పార్థసారథి ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ కుమార్ యాదవ్ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే, ఎంపీలను కూటమి నాయకులు గజమాలతో సత్కరించారు. .ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. ప్రజలు అప్పగించిన బృహత్తర బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబుముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే ఐదు సంతకాలతో ప్రజలు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకొన్నారని తెలిపారు. గత పాలకుల వైఫల్యాలు వల్ల రాష్ట్ర పరిస్థితి దారుణంగా మారిందని మండిపడ్డారు. చంద్రబాబు కాకుండా ఏ ముఖ్యమంత్రి ఈ పీఠంపై కూర్చున్న పారిపోయే పరిస్థితులు వైసీపీ పాలకులు నెలకొల్పారని చెప్పారు. విజనరీ నాయకుడుగా దూరదృష్టి కలిగిన చంద్రబాబు సీఎం కావడంతో పారిశ్రామికవేత్తలు అమరావతికి క్యూ కడుతున్నారని వివరించారు. పాఠశాలకు రంగులు వేస్తే అభివృద్ధి అనుకున్న గత పాలకులు, ఉపాధ్యాయులు నియమకాలను మర్చిపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ని ప్రకటించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టిందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.