జీపీఎస్ విధానాన్ని అమల్లోకి తెస్తూ ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఏపీసీపీఎస్ఈఏ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పచ్చార్ల సుధాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఏపీసీఎప్ఈఏ ఆధ్వర్యంలో శనివారం పీలేరులోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ జీపీఎస్‌ను అమలు చేస్తూ గత ప్రభుత్వం జూన 12వ తేదీన తెచ్చిన జీవోను ఒక నెల తరువాత ఈ ప్రభుత్వం గెజిట్ రూపంలో ఇవ్వడం శోచనీయమన్నారు. కాగా సీఎం చంద్రబాబు నాయుడు గతంలో హామీ ఇచ్చిన విధంగా జీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ జీపీఎస్ గెజిట్ ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు సురేశ కుమార్, జయప్రకాశ, ఇంద్రసేనారెడ్డి, ఈశ్వరయ్య, రిజ్వాన, అల్తాఫ్, గంగంగరాజు, నజీర్, విజయ్, శివ, శంకరయ్య, జయరాం పాల్గొన్నారు.