మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ, ఓబీసీ మోర్చా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళి నాయుడు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ఆయన స్వగృహం నందు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాఘవేంద్రరెడ్డికి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.