రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు రాప్తాడు గ్రామ పంచాయతీ పరిధిలోని మైనార్టీ కాలనీలో టీడీపీ సర్పంచ్ సాకే తిరుపాలు మంగళవారం రాత్రి వీధిలైట్లు ఏర్పాటు చేయించారు. ఎన్నికల ప్రచార సమయంలో వీధిలైట్లు వేయించాలని కాలనీవాసులు పరిటాల సునీతను కోరారు. సమస్యను పరిష్కరిస్తానని పరిటాల సునీత వారికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీధిలైట్లను ఏర్పాటు చేయించారు.