తనపై అసత్య ఆరోపణలు చేయడమే కాకుండా ధర్నా చేయాలని పిలుపునిచ్చిన వంశీ తీరును వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఓనమాలు రాయలేని, పొట్టపొడిస్తే అక్షరం ముక్క రాని, జర్నలిస్ట్ అనికూడా సరిగా పలకలేని ఓ మోసగాడు కులం మద్దతుతో బ్లాక్ మెయిలర్ గా, పాత్రికేయుడు గా అవతారమెత్తి ధర్నా చేయాలనీ పిలుపు ఇస్తే పదిమంది జర్నలిస్టులు కూడా వెళ్ళలేదు. వీడు నన్ను ఆంధ్రకు రాకుండా అడ్డుకుంటాడట. అసలు హైదరాబాద్ లో నీ ఆఫీస్/స్టూడియో ఉంటుందో ఊడుతుందో చూసుకోరా, టాల్కమ్ పౌడర్ డబ్బా..అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.