విశాఖలో చంద్రబాబు బంధువు గీతం కాలేజీ యాజమాన్యం భూములను ఆక్రమించుకుంటే ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు?. దీనిపై చంద్రబాబు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడం లేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. గీతం కాలేజీ భూములపై టీడీపీ నేతలు చర్చకు రాగలరా? అని సవాలు విసిరారు. కేవలం వైయస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు మోపడానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్లే మళ్లీ నీతులు చెబుతున్నారని విమర్శించారు.