నిబంధనల్ని గాలికొదిలేసి ఎర్రమట్టి తవ్వకాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు, చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి 35 రోజుల్లో విశాఖలోని భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టిదిబ్బల పరిస్థితి ఇది. ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నాయకుల మద్దతుతోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇలా చెప్పకనే చెప్తున్నారు అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ట్యాగ్ చేస్తూ గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేశారు.