తూర్పు గోదావరి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డి. నరసింహ కిషోర్ ను గురువారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి జిల్లా ఎస్పీకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రిలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా అమలయ్యే విధంగా చూడాలని కోరారు. దానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.