బొమ్మనహళ్ తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారింది. ఒక్కసారిగా ఇన్ ఫ్లో పెరిగినట్లు అధికారులు తెలిపారు. డ్యామ్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తడంతో ఇన్ ఫ్లో 49, 522 క్యూసెక్కులకు చేరింది. నేడు 63 వేల క్యూసెక్కులకు చేరవచ్చు అని అధికారులు గురువారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 105. 788 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి గాను 39. 718 టీఎంసీలకు పైగా నీరు నిలువ ఉందన్నారు.