చిత్తూరు జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో నిత్యావసరాల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. ప్రతి మండలంలో గురువారం నుంచి బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాలు ప్రారంభించాలన్నారు. బహిరంగ మార్కెట్లో ధరల నియంత్రణకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బియ్యం, కందిపప్పు, నూనెను, రైతు బజార్లలో విక్రయిస్తామన్నారు.