చిత్తూరు జిల్లాలో అన్ని శాఖలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం ఈ నెల 21 వ తేదీన చిత్తూరు రెవిన్యూ భవన్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పీబీ బాలసుబ్రమణ్యం శుక్రవారం తెలిపారు. సమావేశానికి జిల్లాలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరు పాల్గొని, శాఖల వారిగా సమస్యలు తెలియజేయాలని అన్నారు. ఈ సమస్యను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు