రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిపై దాడి అత్యంత హేయం అని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. అయన మాట్లాడుతూ.... ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుంది. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి. అధికారం శాశ్వతం కాదు అని అన్నారు.