రాష్టంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి అని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ.... గుంటూరు జిల్లాలో వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వారి దాడులు తీవ్రమవుతున్నాయి. వినుకొండలో నడి రోడ్డుపై రషీద్‌ను దారుణంగా నరికి చంపారు. వ్యక్తిగత వివాదాలు, పాతకక్షల వల్లే ఆయన హత్య జరిగిందని, అర్థరాత్రి హడావిడిగా ఎస్పీ చెప్పడం దారుణం. అలాంటి ఎస్పీకి రాష్ట్రంలో పని చేసే అర్హత లేదు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు పెరిగాయి. దాదాపు 3 వేల కుటుంబాలు ఇళ్లు, ఊళ్లు వదిలి వెళ్లాయి. మరోవైపు మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు అధికమయ్యాయి. మా పార్టీ వారిపై నానాటికీ దాడులు పెరుగుతున్నా, పోలీసులు అస్సలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు 40 రోజుల పాలనలో అనేక దారుణాలు జరిగాయి. ఆడపిల్లల జోలికి వస్తే.. భయపడేలా చేస్తామన్న పవన్‌కళ్యాణ్.. ఇప్పుడు నోరు మెదపడం లేదు.