పక్కా ప్లాన్‌తో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ.... గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. 31 హత్యలు, 35 మంది ఆత్మహత్యలు జరిగాయి. ఏకంగా 2,750 కుటుంబాలు ప్రాణభయంతో వలస పోయాయి. ప్రతిపక్షాన్ని టెర్రరైజ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీని తలపిస్తున్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హైకోర్టు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి. వినుకొండ హత్యకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అటు పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి చేశారు. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది?. వారం లోగా పరిస్థితిని చక్కదిద్దాలి. లేకపోతే రాజీనామా చేయాలి. మా ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుంది అని అన్నారు.